I) లోహాలు
1)దేవలోహం:
దేవలోహం అను మహారసం దక్షిణ భారత దేశంలో కొండలు తవ్వుతున్నప్పుడు భూమిలో నుంచి బయటకు వచ్చును ఇది నాలుగు రంగులు కలిగి ఉంటుంది తెలుపు నలుపు ఎరుపు పసుపు లో లభించును దీనిలో ఎరుపు శ్రేష్టమైనది దీనిని కాల్చి ఉసిరి రసంలో చల్లార్చి తరువాత ఈ లోకమును తప్తము చేసి పంచగవ్యమందు చల్లార్చిన శుద్ధి అవుతుంది. దేవలోహమును ధరించిన మానవుడు అతనిలో నాడీ చలనాలు జరిగి అవి సరి అయిన క్రమములో దాని పనులు చేయను దీనిని పొడిచేసి బొట్టుగా ధరిస్తే ఎలాంటి నెగటివ్ చలనం మనలోకి రాదు . దీనిని మెడలో ధరిస్తే అధిక ధారణ శక్తి కలిగి మహా మేధావి అవుతాడు ఇతనిని ఓడించడం కష్టం సౌందర్యం పెరిగి యవ్వనవంతటిగా ఉంటాడు వీరికి మృత్య భయం ఉండదు.
దేహలోహమును శుద్ధిచేసి సేవించవలెను ఇది రసాయంగా పనిచేస్తుంది అన్ని వ్యాధులను నాశనము చేస్తుంది 30 రోజులు దీనిని సేవిస్తే 1000 సంవత్సరాలు ఆయుస్సు కలుగును.
2)అగ్నిజారు:
జారనక్రియ :
మనిషికి సిద్ధి కలగడానికి ఈ క్రియను చేస్తారు. సముద్ర ప్రాణి జరాయు సదృశ్యముగా బడబానలము వంటి పదార్థము ను అగ్నిజారు అంటారు.
ఇది స్పర్శ వేధి స్పర్శ మాత్రమున సర్వదాతువులను వేధ చెయ్యను. అందువల్ల దానిని తాకకుండా గ్రహించవలెను. వర్షాకాలంలో మేఘ గర్జన లేని సమయంలో లభించును. ఇది ఐదు రకాలుగా లభించును 1) పారావత 2) హంస 3) చక్రవాక 4) వహ్నిక 5)శుకము.
హంస: మొదలు చివర పక్క భాగములు ఎర్రగా ఉంటుంది.
చక్రవాకం: పాదములు పసుపు నలుపుగా అందంగా చక్రం వలె క్రింద మీద కలిగి ఉంటుంది.
వహ్నిక: నీలముగా నెమలి వలె పొడవుగా ఇంద్రధనస్సు వలె లక్కరంగు కలిగి దాసాని పువ్వు వలె ఎర్రనై ఉదయ సూర్యుని వలె ఇంద్రగోపం వలె ఇంగిలీకం వలె క్రింద భాగం నీలమైన దానిని వహ్నిక అంటారు.
శుకము: చిలుక తోక రంగుతో పైన క్రింద ఎర్రనైనది శుకము అంటారు. హేమ ప్రక్రియలో దీనిని ఉపయోగిస్తారు.
పారావత: మొదలు చివర ఎర్రగా ఉంటుంది
అగ్నిజారును చేతితో తాకరాదు సొరకాయ పాత్రలో ఉంచి నెయ్యి రాయాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి