H) సింధూరం
తండావాళ సింధూరము:
తండావాళం వ ౫ం, గంధకం ప ౧౦, రసం వ ౫, తండావాళం కొలిమిలో వేసి కాచి గోమూత్రాన వేసేది, ఇసుకవలె చేసుకొని ఆ పొడి కలబందరసాన కాటుకవలె నూరి బిళ్లగాకట్టి ప్రమిదలోవుంచి మరి యొక ప్రమిదచేమూ, శీలమన్నుయిచ్చి గజపుటం వేసేది. పుఠాలు ౫ గంధకంవేసి అరపొడి మూడుపలాలు కూర్చి ఆరసాన నూరి మూడుపుఠా లువేసేది. గంధకంవేసి, పుఠాలు ౫. వరాయెత్తు, రసం వేసిసూరి వొక పుటం గజపుటంవేసేది, సింధూరం తయారగును. ఇందుకు అనుపానం త్రికటుకం వోమం, జీలకఱ్ఱ, పొడిచేసి రూక యెత్తు తేనెతోయిచ్చిననీకు బిళ్లలు, మహోదరాలు, ఆముగడ్డలు, ర క్తగడ్డలు, శ్వాస కాసాలు, గు ల్మాలు, హృద్రోగాలు, మానును, యిచ్ఛాపథ్యం..
* వంగసింధూఠము:
శు తగరమును బానలియందుబోసి కరగించి ఉత్త రేణు వేళ్ళ చూర్ణమునుగాని నేలయునిరిక వేళ్ళ చూర్ణమును గాని వేసి, ఇనుపగరిటెతో రుద్దుచుండిన నది భస్మమగును. దానిని మూసయందిడి సంధిబంధనము చేసి నిమ్మపండ్లరసముతో నూరి మూడు గజపుటములు వేసిన సింధూరమగును. ఇది బలానుసారముగ మోతాదు నిర్ణ యించి యుక్తియుక్తముగ వ్యాధినిబట్టి అనుపానము విధించి సేవించిన యకృత్ల్పహ వృద్ధులు, సంకోచాదులు, కఫోద్రేకము, పాండువు, సకలమేహ ములు హరించును.
* లోహసింధూరము:
శు ఇంగిలీకము 1 భాగము, వీనికి 12 భాగములు శుద్ధి చేసిన లోహమార్థమును జేర్చి కలబందరసముచే రెండు జాములు మర్దించి బిళ్ళజేసి యెండబెట్టి, శరావములయందిడి చీల జేసి 7 గజపుటములనిడిన శుద్ధభస్మమగును. ఇట్టిలోహ భస్మమును త్రిఫలరసము, మట్టిపాలు, జిల్లేడుపాలు, అనువా నిచే 7 దిములు మర్దించి గజపుటము నిడవలయును. ఈవిధ
ముగ మర్దించి 7 గజపుటములనిడినను; లేక కొలిమిలో పెట్టి యూదినను, లోహము సింధూరించును. ఇట్టిది రసభస్మముతో చేర్చి నుపయోగించిన సమస్తరోగములు హరించును. రస భస్మము చేర్చక కేవల సింధూరము నయినను యుక్తియుక్త ముగ అనుపానము విధించి సేవించిన యకృల్లీ ్పహవృద్ధులు, సంకోచాదులు, పాండు, మహోదరములు, అర్శస్సులు, శూలలు, వాత, పిత్త, కఫ, ప్రకోవరోగములు, శోఫలు, జ్వరములు, గుదార్శములు మేహములు హరించును.
* కాంతసింధూరము:
శుకాంతమునకు చతుర్థభాగము శు॥గంధకమును జేర్చి జిల్లేడుపాలు, కొండపిండి వేళ్ళ రసము, మోదుగు చెక్క రసము యీ మూడింటిచే వేర్వేరుగ మర్దించి మూడు గజపుటముల నిచ్చిన భస్మమగును. అట్టి భస్మమునకు సగభాగము ఇంగి లీకమును జేర్చి దూలగొండి వేళ్ళ రసముతో మూడుదినములు మర్దించి యెఱ్ఱగమంటితో జేయబడిన వక్త్రమూషలోనుంచి మూడు చీలమన్నుల నిచ్చి మూడుగజపుటముల నిచ్చిన బాల సూర్యునివలె శాంతము సింధూరించును.
ఇట్టిది విధియుక్తాను పానములతో తగుమోతాదులుగ నిచ్చిన యకృతీ హరోగములు, గుల్మము, మూలరోగము, పాండువు, ఉదరరోగములు, శూల, త్రిదోపములు హరిం చును. మరియు ప్రమేహముల హరింపజేసి, శరీర కాంతి నిచ్చి దీర్ఘాయువును గలుగ జేయును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి