ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

7, ఏప్రిల్ 2026, మంగళవారం

నెగిటివ్ ఎనర్జీ రకాలు

 

నాడి తంత్ర: నెగిటివ్ ఎనర్జీ రకాలు

           నెగిటివ్ ఎనర్జీ 11 రకాలుగా ఉంటుందని నాడీ తంత్ర తెలియజేస్తుంది.

1) ఇంట్లో మరణాలు: ఇటీవలి కాలంలో మరణాలు, యాంత్రిక మరణాలు, అనుకోని మరణాలు, బలవంతపు మరణాలు 

2) రుణాలు: కుటుంబీకులు ఎంత ఆదాయం తెస్తున్నా వ్యయం పెరగడం, అనుకోకుండా ఖర్చులు రావడం వ్యాధులకు జల్సాలకు అధిక ఖర్చులు చేయడం.

3) దృష్టి: వీరిపై బంధువుల పోరు వీధిలో వారి పోరు స్నేహంగా ఉండి శత్రువులైన వారి పోరు ఉంటుంది వీరి విలాసాలను ఎదుట వ్యక్తులు చూడలేరు.

4) ఇంట్లో ఉండేవారు ఒకరికి ఒకరు వ్యతిరేకత: భర్త భార్య మధ్య అనుబంధం తగ్గడం తల్లి పిల్లలు లేదా తండ్రి పిల్లలు మధ్య సఖ్యత లేకపోవడం పెద్దవారు అంటే గౌరవం లేకపోవడం.

5) దేవునిపై భక్తి లేకపోవడం: వైరాగ్యం కలగడం దేవునిపై కోపం ద్వేషం పెంచుకోవడం, ఇతర మతాల్లోకి మారడం,

6) ప్రతి నెల ఇంట్లో వారికి ఏదో ఒక వ్యాధి రావడం: ఇంట్లో వారికి తరచుగా వ్యాధులకు గురి అవ్వడం ఆసుపత్రుల చుట్టూ తిరగడం అనారోగ్య కారణాలు.

7) అనుమానాలు: ఇంట్లో ఒకరిపై ఒకరు అనుమానం పడడం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, తనకోసం ఇతరులు ఏమైనా అనుకుంటున్నారేమో అని అనుమానం.

8) మానసిక ప్రశాంతత లేకపోవడం: ఇంట్లో వారికి మానసిక ప్రశాంతత లేకపోవడం ఇంట్లో వారు ఒత్తిడికి గురి అవ్వడం.

9) డబ్బులు నిల్వ ఉండకపోవడం: కష్టపడి ఎంత డబ్బులు సంపాదిస్తున్న వేగంగా ఖర్చు అవుతుంది.స్నేహితులు అడిగారని డబ్బులు ఇవ్వడం, చేయకూడాని దానాలు చెయ్యడం.

10) గొడవలు: పొరుగు వారితో గొడవలు,ఉండే ప్రదేశం లో సఖ్యతగా ఉండలేకపోవడం,భంధువుల పోరు,

11) కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం: అత్యధిక నెగిటివ్ ఉండే గృహాలకు వెళ్ళడం,కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం, మనుషులు సంచారం లేని ప్రదేశాలకు వెళ్ళడం, కొన్ని ప్రార్థన మందిరాలకు వెళ్ళడం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...