ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

7, ఏప్రిల్ 2026, మంగళవారం

లవణాలు

 

K) లవణాలు

* కరంజ లవణము:

క్రానుగు చెక్క 200 పలములు దెచ్చి దంచి 2 ద్రోణ ముల ప్రమాణము కలిబోసి అష్టావ శేవముగ కషాయము

గాచి వడియగట్టి, అందు ఉప్పు 4 ప్రస్థములు, వెల్లుల్లి 2 ప్రస్థ ములు, మేకపాలు 1 ఆఢకము, పెరుగుమీద మీగడ 1 ఆఢ కము, నూనె 1 కుడవము, నెయ్యి కుడవము గలిపి బాగుగ పాకము జేసి చిత్రమూలము, త్రికటుకములు, వాము, గలిజేరు వేరు, ఇంగువ, సౌవర్చలవణము, చవ్యము, యవక్షారము, బిడాలవణము, మొక్కము, నల్లజీడి, చింత, మోదుగ చెక్క, మందూక బ్రహ్మి, పుల్లతీగె, లేక బొల్లిపూస, రేల, జెముడు, అనువాని క్షారములను, జీలకఱ్ఱ, నల్లజీలకఱ్ఱ, అనువానిని దినుసుకు 2 పలముల చొప్పున జేర్చి, నేతితో మాగిన కుండ యందుంచి సేవించిన గుల్మము, అష్ఠీలము, ప్లీహము, శూల, రక్త గుల్మము వీనిని హరింపజేయును. మఱియు 5 చిన్నముల యెత్తు ఇంగువను ఆవువెన్నలో గలిపి ఉదయము సాయంకాల ము సేవించిన రక్త గుల్మమును హరింపజేయును.

* ఆరోగ్యలవణము:

చేదుపుచ్చ 10 పలములు, జెముడు కాడలు 20 పల ములు, ములక కాయలు 100 పలములు, కలబంద 2 పలములు, జిల్లేడుయాకులు 100, దుండిగము 100 పలములు, గుగ్గిలము 2 కుడవములు, వెల్లులి 5 పలములు, సైంధవలవణము 5 పల ములు, కానుగపట్ట 5 పలములు, సౌవర్చలవణము 3 పల ములు, త్రికటుకములు 5 పలములు, కాచాలవణము 2 పల తులు, సాముద్రలక్షణము 10 పలములు, బిడాలవణము

పలము, శంఖము 2 పలములు, కృష్ణలవణము 2 పలములు; వాము, అజామోదము ఇవి అర్ధపలము; ఇంగువ 1 పలము; పెద్దజీలకఱ్ఱ 1 పలము, పిన్న జీలకఱ్ఱ 1 పలము; ఆవాలు 1 కుడ వము; చిత్రమూలము అర్ధప్రస్థము ఇవి దంచి నలియగొట్టి, యందు జిల్లేడుపాలు అర్థవస్థము, సర్ష పతైలము 2 కుడవ ములు చేర్చి, పొగ వెలుపల పోకుండునట్లు కాల్చి అట్టిదానిని అర్ధకర్షము, మజ్జిగ తేటతో నేవించిన గుల్మము, శూల, కడు పుబ్బరము,యకృత్ల్పహరోగములు, అష్ఠీలము, ఊర్థ్వవాతము, వాత కుండలి, అశ్మరి లోనగునవి హరించును. 

* లవణభాస్కరము:

పిప్పళ్ళు, పిప్పలీమూలము, ధనియాలు, జీలకర్ర, సైంధవలవణము, బిడాలవణము, తాళీనపత్రి, నాగ కేశరమణ లు వీనిని దినుసునకు 2 పలములు; సౌవర్చలవణము 5 భాగ ములు; సుగంధిపాల, జీలకర), సొంటి ఇవి దినుసునకు 1 పలము; లవంగపట్ట, ఏలకులు ఇవి దినుసునకు అరపలము; సాముద్రలవణము 2 కుడవములు; దానిమ్మ 1 కుడవము; ఆమ్ల వేత సము 2 పలములు వీనిని చూర్ణముజేసి, మజ్జిగ, పెరుగుమీదనీరు, సుర, శుకము, బలానుసరముగా వీనిలో నెద్దానితోనైన బేడెత్తు చొప్పున సేవించిన వాతగుల్మము, ఆమరోగము, యకృత్ల్పహరోగములు, శూల, మూలరోగము, ఉదరము, క్షయము హరించును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...