L) ద్రావకాలు
శంఖద్రావకము:- (మొదటి విధము)
జిల్లేడు, బొంత జెముడు, చింత బెరడు, నువ్వులు, రేల, చిత్రమూలము, ఉత్త రేణు వీనిని సమాంశములుగ గొని
భస్మముజేసి, పరిశుభ్రమైన గుడ్డతో వడియగట్టి నీటియందు వైచి, మెల్లని మంటతో వండి ఉప్పగనై న తరువాత సైంధవ లవణము; సర్జక్షారము, వెలిగారము, సముద్రపునురుగు, హరి దళము, కాసీసము, సురాకారము ఇవి దినుసునకు ఒక్కొక్క భాగము, సముద్రలవణము, కాచలవణము, సౌవర్చలవణము, బిడాలవణము, చవటిఉప్పు, ఇవి దినుసునకు రెండేసిభాగములు వీనిని మాదీఫలరసముచే మర్దించి గాజుకుప్పె యందుంచి అందు పులుసురసములబోసి 7 దినములుంచి, నాలుగుతుల ముల శంఖచూర్ణము నందు కలిపి సారాయిభట్టియందు పక్వముజేసి ద్రావకి మును తీయవలయును. ఇది గవ్వలు; శంఖము లోనగు ధాతువులను కరిగించును. ఇది యుక్తియుక్త ముగ తగు మోతాదులుగ నిచ్చిన యకృతహవృద్ధులు, శూలలు; ఉదరరోగములు హరించును.
* శంఖద్రావకము: (రెండవ విధము)
శంఖభస్మము, యవక్షారము, సర్జక్షారము, పొంగిం చిన వెలిగారము, పంచలవణములు, పటిక, నవసాగరము, వీని చూర్ణములను సమాంశములుగ ఒక గాజు పాత్రయందు జేర్చి, వారుణియంత్య్రము (అనగా నాళికాయంత్రము) ద్వారావండి ద్రవరూపము గావించి సంగ్రహపరచి యుక్తియుక్తముగ 12 బిందువులకు మించకుండా మోతాదు నిర్నయించి యిచ్చిన
యకృల్లీ హవృద్ధి, సంకోచాదిరోగములు, సర్వశూలలు, అర్సస్సు, మూత్రకృచము, గ్రహణి లోనగునవి హరిం మును. మరియు, గురుకరమగు నెట్టి పదార్థములు భుజించి యున్న ను నతి త్వరలో పచనము గావించును. శంఖములు, నత్తగులకలు, గవ్వలు ఈ ద్రావకమునందు ముంచియుంచిన రెండుగంటల వ్యవధి లోపలనే ద్రవముగ జేయును.
* మహాద్రావకము:
అడ్డసరము, చిత్రమూలము వేళ్లు, ఉత్త రేణు వేళ్ళు, చింత
బెరడు, బూడిదగుమ్మడి చెట్టు కాడలు, ఆశుజెముడు వేళ్ళు,
తాటిమోవుజట, తెల్లగలిజేరు వేళ్లు, ప్రబ్బలి వేళ్లు, వీనినన్నింటి
క్షారములుతీసి, సమాంశములుగ జేర్చి, నిమ్మపండ్ల రసముతో
భావన జేసి, పరిశుభ్రమగు గుడ్డతో వడియగట్టి పిదప దానిని
సూర్యపుటమున నెండించి, అందుండి రెండుతులముల ఔషధ
ములనుతీసి, వానితో 2 పలముల యెత్తుగల యవక్షారము
పటిక 1 పలము, సైంధవలవణము 4 తులములు, పొంగించిన
వెలిగారము 2 తులములు, శు! అన్నభేది 1 తులము, ముద
శంఖ, శంఖనాభి 1 తులము, తెల్లపాషాణము 2. తులములు,
సొరపీయి 1 తులము వీని సన్నింటిని చూర్ణముగావించి. ఒక
యంత్రమున ద్రావకము దీసి యు క్తయు క్తముగ 5 చుక్కలకు
మించకుండా మోతాదు నియమించి చన్నీటితో కలిపి యిచ్చిన
యకృల్లీహవృద్ధులు, ఉదరరోగాదులు హరించును.
* శంఖద్రావకము:— (మూడవవిధము)
జిల్లేడు, బొంత జెముడు, చింతబెరడు, నువ్వులు, రేల, చిత్రమూలము, ఉత్త రేణు ఇవి యన్నియు సమాంశములుగ గైకొనీ భస్మములుజేసి వడియగట్టి నీటిలో మిళితము జేసి పరి శుభ్రమైన గుడ్డతో వడియగట్టి, దానిని మందాగ్నిచే వ౦డి ఉప్పగనైన పిమ్మట అందుండి 4 తులముల ద్రవమునుతీసి, వానిలో యవాక్షారము, సర్జక్షారము, పొంగించిన వెలిశా రము, సముద్రపు నురుగు (సౌరపీయి), గోదంతపాపాణము, కాసీసము, సూరేకారము ఇవి దినుసునకు 4 తులములు చొ ప్పునయున్నూ, పంచలవణములు ప్రత్యేకముగ 8 తులములు చొప్పునయుమ్నా చూర్ణముగామించి చేర్చి నిమ్మ పండ్లరసముతో భావనజేసి పిదప గాజుబుడ్లలో 7 దినములు సంగ్రహపరచిన తిరువాత 8 తులముల శంఖ చూర్ణమును జేర్చి, తదుపరి వారుణీ యంత్రమూలమున ద్రావకమును తీయవలయును. అంనుండి い యుక్తి యుక్తముగ 5 చుక్క-లకు లోపుగ మోతాదు నియ మించి చన్నీటిలో కలిపి నిచ్చిన యకృత్ల్పహ వృద్ధులు, ఆమా శయవృద్ధి, ఉదరరోగములు హరించును.
* మహాశంఖ ద్రావకము:
చింత బెరడు, రావి బెరడు, బొంతజెముడుపట్ట, జిల్లేడు పట్ట, ఉత్త రేణు వీనిని భస్మముజేసి ఉప్పుగనైన తరువాత
సముద్రలవణము, సైంధవలవణము, సౌవర్చలవణము, కాచా లవణము, బిడాలవణము, పొం వెలిగారము, యవక్షారము, సర్జ క్షారము, ఇంగువ, తాటిపూజడభస్మము, లవంగాలు,నవాసాగ రము,జాజికాయ, శు। హరిదళము, స్వర్ణ మాక్షికము, శు గంధ క్రము, శు పాదరసము, శు । నాభి, సముద్ర పునురుగు,సురేశారము, పటిక, శంఖ చూర్ణము, శంఖనాభిచూర్ణము, కొండపిండి వేళ్ళ చూర్ణము, మ॥ మణిపిల, ము! కాసీసము ఇవి సమభాగములు వీనిని చూర్ణించి పుల్లప్రబ్బలిరసము చేభావన జేసిగాజుకుప్పెలోనునిచి, "ఆగాజుకు ప్పెకు చీరనిచ్చి, ఉష్ణస్థానమున 7 దినములుంచితరువాత మందాన్నిచే వారుణీ యంత్రమున (అనగా సారాయిభట్టీతో) *వండిన ద్రావకము దిగును. పిమ్మట గాజుసీసామీద చన్నీటిని బోసి చల్లార్చి, అందలి ద్రావకమును ! గురిగింజ ప్రమా ణము తమలపాకులోనుంచి నిత్యము సేవించిన యకృత్లీహ వృద్ధులు, సంకోచాదులు, దారుణమగు అజీర్ణానులు, క్రిమి రోగము, గ్రహణి, రక్త పిత్తము, గుల్మము, అర్మోరోగము, అశ్మరీ, మూత్రకృచ్ఛము, అష్టవిధశూలలు, ఆమవాత చు", వాతరక్తము, ఉదరరోగములు, కాస, శ్వాస, క్షమాదులు హరించును.
దీనియందు శంఖములు, ముత్తెపుచిప్పలు, గవ్వలు, దీనిని వేసిన ఒకటిన్నర జాములలో కరగిపోవును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి