నాడి తంత్ర : నాడి మాలలు
A) మెడలో ధరించు మాలలు
B) కడియాలు
C) వడ్డాణ మాల
D) తల మాల
E)
నాడి తంత్ర శాస్త్రం లో 18 రకాల మాలలు ఉన్నాయి. దీనిలో నాడి మాల అనేది ఒకటి.
A) మెడలో ధరించు మాలలు
నాడీమాల:
ఈ క్రింది వృక్షాలు నుండి పూసలు తయారి చేస్తారు.108 పూసలతో మాలను చేస్తారు. ఈ మాల అతి పవిత్ర మైనది. శక్తివంతమైనది కూడా.
విషముష్టి( అశ్విని నక్షత్రం)
ఉసిరి( భరణి నక్షత్రం)
మేడి చెట్టు ( కృత్తిక నక్షత్రం, శుక్ర గ్రహం)
నేరేడు( రోహిణి నక్షత్రం )
చండ్ర ( మృగశిర నక్షత్రం, కుజ గ్రహం, వృశ్చిక రాశి )
గుమ్మడి టేకు( ఆరుద్ర నక్షత్రం )
వెదురు( పునర్వసు నక్షత్రం)
రావి( అశ్వత్థ నక్షత్రం, పుష్యమి నక్షత్రం, గురుగ్రహం, ధనస్సు రాశి)
నాగ కేసరి ( ఆశ్లేష నక్షత్రం)
మర్రిచెట్టు ( ముఖ నక్షత్రం, మీన రాశి )
మోదుగ( పుబ్బ నక్షత్రం, చంద్ర గ్రహం, కర్కాట రాశి)
జువ్వి ( ఉత్తరా నక్షత్రం )
అడవి మామిడి( అంబస్థ )( హస్త నక్షత్రం )
మారేడు( చిత్త నక్షత్రం)
తెల్ల మద్ది ( స్వాతి నక్షత్రం)
పులివెలగ( ములు వేము ) ( విశాఖ నక్షత్రం)
పొగడ( అనురాధ నక్షత్రం)
తెల్ల లోద్దుగా ( జేష్ట నక్షత్రం )
మండ దుంప ( వేగి)( మూల నక్షత్రం )
కనప ( పూర్వసాడ నక్షత్రం )
పనస( ఉత్తరసాడ నక్షత్రం, మిధునం రాశి )
జిల్లేడు( శ్రవణ నక్షత్రం, రవి గ్రహం)
జమ్మి ( ధనిష్ట నక్షత్రం, శని గ్రహం, కుంభ రాశి)
కదంబం ( శతభిష నక్షత్రం )
మామిడి( పూర్వభద నక్షత్రం, కన్య రాశి )
వేప( ఉత్తరభాద్ర నక్షత్రం )
ఇప్ప ( రేవతి నక్షత్రం)
ఎర్రచందనం( మేష రాశి )
ఏడాకుల పొన్న ( వృషభ రాశి )
కలి గుడ్డు ( పాటలి)( సింహరాశి)
పొగడ( తులారాశి)
జిట్టేగి ( శింశుపా )( మకర రాశి)
గరిక( రాహువు గ్రహం)
ఉత్తరేణి( బుధ గ్రహం)
దర్భ( కేతు గ్రహం )
2)నల్ల చండ్ర మాల :
--దీనిని నల్ల చండ్ర చెట్టుతో చేస్తారు. దీనిలో 108 పూసల మాల,54 పూసల మాల,27 పూసల మాల ఉంటుంది.
-- దీనిని గాయత్రీ మాల అంటారు.
-- చండ్రను గాయత్రి అని పిలుస్తారు.
--ప్రయోజనాలు:
3) వైజయంతి మాల:
-- బాలా రిష్ట దోసాలు నరదృష్టి పిల్లలకు రానివ్వదు.
-- వివాహము కాని వారు దీని ధరిస్తే వివాహం తప్పక అవుతుంది.
-- దంపతుల మధ్య గొడవ ఉంటే తగ్గును అన్యోన్యత పెరుగుతుంది.
-- శుక్ర గ్రహ దోషాలు తెలుగును
-- లక్ష్మీదేవి మాత అనుగ్రహం వల్ల ధనాభివృద్ధి కలుగును.
-- వైజయంతి మొక్క నుంచి దాని విత్తనాలతో తయారుచేస్తారు ఇది ఒక పొడవైన గడ్డి జాతి మొక్క.
4 ) త్రినేత్ర మాల:
-- ఈ మాలలో మూడు పూసలు ఉంటాయి
-- వైజయంతి పూస, రుద్రాక్ష, నల్ల జమ్మి పూస
-- పై మూడు పూసలను వరుసగా కట్టి ధరించాలి
-- ఎలాంటి దృష్టి మన శరీరం పై రానీయదు.
-- అన్ని గ్రహాల ప్రభావం మన మీద సానుకూలంగా ఉంటుంది.
-- దీనిని మెడలో గాని చేతి మీద గాని ధరించవచ్చు.
5 ) నల్ల జమ్మి మాల:
--నల్ల జమ్మి చెట్టు తో తయారుచేస్తారు. ఇది అరుదైన అంతరించుపోతున్న ఔషద వృక్షం. పార్వతి అమ్మవారు కొలువున్న వృక్షం.
6 ) రుద్రాక్ష మాల :
--1 ముఖి రుద్రాక్ష: శివస్వరూపం - భోగాలు, మోక్షం కలుగుతాయి. (మంత్రం: ఓం హ్రీం నమ:
*2 ముఖి రుద్రాక్ష: దేవదేవేశ్వర స్వరూపం - సకల కోరికలు నెరవేరుతాయి. (మంత్రం: ఓం నమ:)
*3 ముఖి రుద్రాక్ష: అగ్ని స్వరూపం - సకల విద్యలు వంటబడతాయి. (మంత్రం: ఓం క్లీం నమః)
*4 ముఖి రుద్రాక్ష: బ్రహ్మ స్వరూపం - ధర్మ, అర్థ, కామ, మోక్షాలు లభిస్తాయి. (మంత్రం: ఓం హ్రీం నమ:)
*5 ముఖి రుద్రాక్ష: కాలాగ్ని రుద్రుడు - సకల పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. (మంత్రం: ఓం హ్రీం నమః)
*6 ముఖి రుద్రాక్ష: కార్తికేయ స్వరూపం - కుడిచేతికి ధరిస్తే బ్రహ్మహత్యాది దోషాలు పోతాయి. (మంత్రం: ఓం హ్రీం హుం నమః)
*7 ముఖి రుద్రాక్ష: అనంగ స్వరూపం - దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడవుతాడు. (మంత్రం: ఓం హుం నమః)
*8 ముఖి రుద్రాక్ష: భైరవ స్వరూపం - సంపూర్ణ ఆయుష్షు లభిస్తుంది. (మంత్రం: ఓం హుం నమః)
*9 ముఖి రుద్రాక్ష: నవదుర్గ/కపిలముని స్వరూపం - ఎడమచేతికి ధరిస్తే సర్వేశ్వర తత్వం సిద్ధిస్తుంది. (మంత్రం: ఓం హ్రీం హుం నమ:)
*10 ముఖి రుద్రాక్ష: శ్రీ మహావిష్ణు స్వరూపం - సకల కోరికల సిద్ధి. (మంత్రం: ఓం హ్రీం నమః)
*11 ముఖి రుద్రాక్ష: ఏకాదశ రుద్రరూపం - అన్ని చోట్లా, అన్ని పనుల్లో విజయం. (మంత్రం: ఓం హ్రీం హుం నమః)
*12 ముఖి రుద్రాక్ష: ద్వాదశాదిత్యులు - జుట్టు చివర (కేశాగ్రాన) ధరించాలి, ముఖంలో గొప్ప తేజస్సు వస్తుంది. (మంత్రం: ఓం కౌం రౌం నమః)
*13 ముఖి రుద్రాక్ష: విశ్వేదేవతలు - సౌభాగ్యం, మంగళకరమైన శుభాలు కలుగుతాయి. (మంత్రం: ఓం హ్రీం నమః)
*14 ముఖి రుద్రాక్ష: పరమశివ స్వరూపం - భక్తితో తలపై ధరిస్తే సకల పాపాలు నశిస్తాయి. (మంత్రం: ఓం నమః)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి