నాడి తంత్ర: ఆరా
మానవ శరీరం చుట్టూ ఉండే జీవ విద్యుదయస్కాంత క్షేత్రమే ఆరా.
తల వద్ద ఆరా ఎక్కువగా ఉండి, పాదాల వద్దకు వచ్చేసరికి తక్కువగా ఉంటుంది. ఇది ఏడు పొరలుగా ఉంటుంది. ప్రతి ఆర పొర మన శరీరంలో గల ఏడు చక్రాలకు సంబంధం కలిగి ఉంటుంది. మనం చేసే పనులు బట్టి ఆరా రంగులు మారుతూ ఉంటుంది. మన శరీరంలో వ్యాధులను బట్టి కూడా ఆరా రంగులు మారుతూ ఉంటుంది.
మొదటి పొర:
లింగ శరీరం అంటారు. ఇది మూలాధార చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మానవ శరీరానికి దగ్గరగా ఉన్న పొర. ఈ పొర ఐదు సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది.
రెండవ పొర:
దీనిని భావాత్మక శరీరం అని పిలుస్తారు. ఇది స్వాధిష్ఠాన చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఏడు సెంటీమీటర్లు వరకు విస్తరించి ఉంటుంది.
మూడవ పొర:
దీనిని మానసిక శరీరం అని పిలుస్తారు. ఇది మణిపురా చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. 7-20 cm వరకు విస్తరించి ఉంటుంది.
4వ పొర:
దీనిని ఆస్ట్రల్ శరీరం అని పిలుస్తారు. ఇది అనాహత చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. 15-30 cm విస్తరించి ఉంటుంది.
అయిదవ పొర:
Etheric template body అంటారు. ఇది విశుద్ధ చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది.
ఆరవ పొర:
Celestial body అని పిలుస్తారు. ఇది ఆజ్ఞా చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది.
ఏడవ పొర:
Casual body అని పిలుస్తారు. ఈ పొరలు గత జన్మల వివరాలు ఉంటాయి. ఈ పొర మన ఆధ్యాత్మిక అభివృద్ధిని సూచిస్తుంది.
-- ఆరా లో ఎక్కువ భాగం ఎర్ర రంగు ఉంటే ఇతరుల యోగక్షేమాల కోసం పాటుపడే వ్యక్తి అని చెబుతుంది.
-- శరీరం నుండి ఎర్రటి కాంతిపుంజలు వెలువడితే శరీరంలో ఆరోగ్యంగా ఉన్నట్లు.
-- నిర్జీవంగా కనిపించే ఎరుపు గాని మట్టి రంగు కలిపిన ఎరుపు గాని ఓ ప్రదేశంలో నెమ్మదిగా ఊగిసలాడుతూ కనిపిస్తే అక్కడ క్యాన్సర్ వ్యాధి పెరుగుతుందని అర్థం.
-- రెడ్ బ్రౌన్ ఆరాగల వ్యక్తి చాలా నీచంగా ప్రవర్తిస్తాడు శరీర అవయవాల మీద కనిపిస్తే భయంకరమైన వ్యాధులు ఉన్నట్లు.
-- ఆరంజ్ రంగు ఉంటే మానవతావాదులు అని అర్థం.
-- బ్రౌన్ ఆరెంజ్ మిశ్రమం కనిపిస్తే సోమరితనం కలవాలని, బంగారు రంగు పసుపు ఆరా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బాగా ఎదిగినవాడు అని అర్థం.
-- ఆకుపచ్చ రంగు కలిగి ఉంటే గొప్ప వైద్యులు అని చెప్పవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి