ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

6, ఏప్రిల్ 2026, సోమవారం

నాడి తంత్ర : నవగ్రహాలు

 

                                                          నాడి తంత్ర : నవగ్రహాలు

 

నవగ్రహాలు శరీరంపై ప్రభావం:

 కుజుడు:

--పిత్త దోషాలు, మసూచి, అల్సర్లు, బిపి, గాయాలు, సర్జరీ, కత్తిపోట్లు, రసాయనాలు శరీరం మీద పడడం, కాలడం ( కుజుడు బాగా లేకపోతే సర్జరీ జరుగుతుంది), కడుపులో మంట, శరీరంలో వేడి, బ్లీడింగ్

-- కుజుడు, బుధుడు తో కలిస్తే చర్మ రోగాలు వస్తాయి.

-- కుజుడు రాహువుతో కలిస్తే విష ప్రయోగం, తలనొప్పి, నీరసం, మెదడులో రక్తనాళాలు చుట్టుట పైత్యరోగం హెర్నియా, ఆటలమ్మ, మసూచి, కండరాల నొప్పి, అపెండిక్స్, అబార్షన్, శాస్త్ర చికిత్సలు  

 బుధుడు:

--మెదడుకు సంబంధించిన వ్యాధులు, పిట్స్, చర్మవ్యాధులు, రక్తలేమి, ( మెదడులోని ఆలోచనలకు కారకుడు బుధుడు), నొప్పులు, వణుకుట, చలి జ్వరం, వాత పిత్త కఫ రోగాలు, నరాల వ్యాధులు, చెవుడు, నరాల ఒత్తిడి, అజీర్ణం, నరాల బలహీనత

-- బుధుడు, చంద్రుడు కలిస్తే మానసిక బలహీనత, మూర్ఛ రోగం వస్తుంది.

-- బుధుడు, గురుడు కలిస్తే మెదడువాపు వ్యాధి వస్తుంది.

-- బుధుడు, కుజుడు తో కలిస్తే బ్రెయిన్ క్యాన్సర్, మనస్తత్వానికి సంబంధించిన వింత జబ్బులు వస్తాయి.

 రవి:

--జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె వ్యాధులు, అధిక జీర్ణశక్తి, జ్వరం వచ్చినట్లు అనిపించుట, వాత పిత్త కారణాలు, వేదన, లోబిపి 

 చంద్రుడు:

--అతి నిద్ర, ఊపిరితిత్తుల వ్యాధులు, పిచ్చి, కఫ వ్యాధులు, కలరా, మలేరియా, కామెర్లు, రక్త దోషాలు, మానసిక వ్యాధులు, మెదడు, డిప్రెషన్, నెగిటివ్ ఆలోచనలు, వాంతులు, మలబద్ధకం, మూత్ర బంధం, నీళ్ల విరోచనాలు, దాహం, తల తిరగడం, ఎడమ కంటి వ్యాధులు, మానసిక వ్యధ, పిచ్చి, హిస్టీరియా, తెల్ల బట్ట, విష ప్రయోగం, జలుబు,వాత కఫ దోషాలు కారణమగుట.   

గురుడు:

--కాలేయము నందు వ్యాధులు, కఫ రోగములు, చెవికి సంబంధించిన వ్యాధులు, షుగర్, క్యాన్సర్, కామెర్లు, రక్త ప్రసరణ, రక్తం చెడిపోవడం, ద్రవాలు పెరగడం, మనిషి లావు కావడం, రక్త సంబంధిత వ్యాధులు, వాత కఫ దోషాలు, గాల్ బ్లాడర్ వ్యాధులు, పొక్కులు, పెద్ద వ్రణాలు, లుకేమియా, లివర్ క్యాన్సర్, జాండీస్ ,అజీర్ణం, పిట్స్, మానసికపరమైన వ్యాధులు.  

 శుక్రుడు:

--రక్తహీనత వాత సంబంధ రోగములు వీర్య సంబంధ వ్యాధులు సుఖ వ్యాధులు మూత్ర కోశ వ్యాధులు, సుఖానికి కారకుడు, దాంపత్య జీవనం, రుతు సమస్యలు, గనేరియా, సిపిలిస్ ,షుగర్ వల్ల వచ్చే గుండె వ్యాధి 

-- శుక్రుడు,గురుడు, రాహులతో కలిస్తే గర్భాశయ క్యాన్సర్, సెర్విక్ క్యాన్సర్ వస్తుంది

-- శుక్రుడు, శని, రాహులతో కలిస్తే ఎయిడ్స్ వస్తుంది.

శని:

--కఫ సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, నొప్పులు,పక్షవాతం, మోకాళ్ళ నొప్పులు, వ్యాధి ఎక్కువ అవడం, కీళ్ల నొప్పి, ఎముకల సమస్యలు, దాహం, రుచి లేకపోవడం, వంటి నొప్పులు, వాతకఫ దోషాలు.   

-- శని,కుజుడు తో కలిస్తే దీర్ఘ రోగాలు, కీళ్లవాతం, నొప్పులు, వాతవ్యాధులు, గజ్జి, చెడుము, దగ్గు, జలుబు, ఆస్తమా నిమోనియా,గోర్లు రాలిపోవడం, ఎముకల జాయింట్ అరిగిపోవడం.  

-- శని,రవితో కలిస్తే కుడికంటిలో వ్యాధులు వస్తాయి .

-- శని,గురుడుతో కలిస్తే లివర్ సిరోసిస్ వస్తుంది.

-- శని,చంద్రుడితో కలిస్తే కంటిలో శుక్లాలు పెరుగును.

-- చంద్రునికి శని నుంచి వ్యతిరేకత వస్తే మనిషి డిప్రెషన్ లోన అవుతాడు

-- శని, బుధుడుతో కలిస్తే నరాలు చచ్చు పడడం, చెవుడు, చెవి సమస్యలు వస్తాయి.

రాహు, కేతువులు:

--హిస్టీరియా, విష ఆహారభక్షణ, పిట్స్ ,క్యాన్సర్, గజ్జి ,బొల్లి ,కుష్టు, నిర్ధారణ కాని వ్యాధులు, వాత దోషం 

 

 రాహువు:

--కుష్టు రోగం, క్యాన్సర్, విష ఆహారం తినడం, పాముకాటు.  

 కేతువు:

--గుండెపోటు, భయం, ఎలర్జీ, బీపీ ,మతి చాంచల్యం, జీవ కణాల నాశనం.  

 

 

                                              నవగ్రహ పరిహారాలు

  రవి:

  --యాలకులు దేవదారు, కుంకుమ వట్టివేరు, అతి మధురం, పద్మకం, అత్తిపత్తి, దీనితో స్నానం చేస్తే రవి దోషం పోతుంది.

 చంద్రుడు:

--పంచగవ్య, శంఖం, ముత్యం, ఎర తామర, స్పటికం వాడితే చంద్ర దోషం పోతుంది.

 కుజుడు:

--మారేడు, చందనం, ముత్తువ పులగం, బిర్యానీ పువ్వు, ఇంగిలీకం,ప్రేంఖనం, పొగడ జటామాంసి వాడకం వల్ల కుజదోషం పోతుంది.

బుధుడు:

--గోమయం, పసుపు, అక్షితలు, జాజికాయ, గోరోచనం, క్షేమ, ముత్యం, పుష్కరములు, బంగారం

గురుడు:

--మాలతి, కుసుమం, జాజిపువ్వు, ఆవాలు, గోరింటాకు, ఇప్ప వాడాలి.

-- మేడిపండు, మర్రి పండు, మారేడు పండు, ఉసిరి దీనిలో నీరు వేసి ఆ నీటితో స్నానం చేయాలి 

 శుక్రుడు:

--ఏలకులు, త్రిఫల, కుంకుమ, జాజికాయ, పుష్కర మూలం 

-- గోరోజనం, గజ మదం, శటి పుష్పం, వీటిని వెండి పాత్రలోని నీటిలో కలిపి స్నానం చేయాలి 

 శని:

--ఆవనూనె, అంజన, లోద్దుగ, బల, శత పుష్ప, జాజికాయ, పేలాలు

 ఆహారంలో తినడం ద్వారా 

-- మినుములు, కొర్రలు, నీల గంధపుష్పాలు వీటిని లోహ పాత్రలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి 

 చంద్రుడు:

--వట్టి వేరు, దిరిసేన పువ్వు, గంధము, కుంకుమ, ఎర్రచందనం తో స్నానం చేయాలి 

 కుజుడు:

--చండ్ర, గంధం, దేవదారు, ఉసిరి, వెండి పాత్రలో కలిపి స్నానం చేస్తే కుజదోషం పోతుంది 

 రాహువు:

--గుగ్గిలం, ఇంగువ, హరిదళం, మనిశిల, వీటిని గేదె కొమ్ము పాత్రలోని జలముతో స్నానం చెయ్యాలి.

 

 ఈ క్రింది వాటిని ఆహారంలో తినడం ద్వారా దానాలు చేయడం ద్వారా రోగం నివారణ అవుతుంది.

 రవి....గోధుమలు, బెల్లం 

 చంద్రుడు....బియ్యం, పాలు 

 కుజుడు.... కందులు, బెల్లం, రాగులు 

 బుధుడు.... పెసలు,

 గురుడు.... శనగలు, పసుపు, ఉసిరి 

 శుక్రుడు... బొబ్బర్లు, ఎలాకులు, తీపి పదార్ధాలు 

 శని....నువ్వులు 

 రాహువు.... మినుములు 

 కేతువు......ఉలవలు  

 

గ్రహాలు.... దాతువులు 

 శుక్రుడు...కాల్షియం, జింక్

 బుధుడు.... పొటాషియం

 చంద్రుడు.... సోడియం

 కుజుడు.... భాస్వరం, అయోడిన్ గంధకం

 శని...ఇనుము, మెగ్నీషియం

 రవి... రాగి  

 గురుడు... జింక్

 

నవగ్రహాలు.. నవ రత్నాలు 

 చంద్రుడు....ముత్యాలు

 కుజుడు.. . .  పగడం

 బుధుడు.. గారుత్మతము 

 బృహస్పతి.. .. పుష్యరాగం 

 శుక్రుడు .. .. వజ్రం 

 శని... నీలా ధారణ 

 రాహువు.. గోమేధం 

 కేతువు .. .. వైడూర్యం 

 సూర్యగ్రహణం దోషం... మాణిక్యం

                                           నవగ్రహాలు శరీరంపై ప్రభావం:

మంత్ర ధ్యానం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. ఈ గ్రహం దోషం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన నాడీ -మూలికను మీ ఒడిలో ఉంచుకొని మంత్రం జపించాలి ఇలా 108 సార్లు మంత్రం జపించాలి. ఆ గ్రహం యొక్క దోషం తొలుగును

                                           రాశులు శరీర భాగాలు

* మేషం --- శిరస్సు

 వృషభం --- ముఖం  

 మిధునం ---ఉదరం 

 కర్కాటకం --- హృదయం 

 సింహం--- కడుపు

 కన్య --- నడుము

 తుల --- నాభి లింగ మధ్యప్రదేశం 

 వృశ్చికం --- జననాంగం 

 ధనస్సు --- తొడలు

 మకరం --- మోకాలు 

 కుంభం --- పిక్కలు 

 మీనం --- పాదాలు

 మేషం: తలనొప్పి, మెదడు వాపు వ్యాధి, సెరిబ్రల్ హేమరేజ్ 

 వృషభం: గొంతు వ్యాధులు, మెడనొప్పి గొంతు బొంగురు, నాలుక పూత, కళ్ళ కలక, మూత్రపిండాల వ్యాధులు, మూత్రాశయం వ్యాధులు, స్వరపేటికా వ్యాధులు,

 మిధునం: శ్వాస నాళాల వాపు, ఊపిరితిత్తుల వ్యాధులు, చెవి వ్యాధులు, క్షయ, చెవుడు, చెవి నొప్పి, లంగ్ క్యాన్సర్ 

 కర్కాటకం: చాతి నొప్పి, చాతి బరువుగా ఉండడం, ఆస్తమా, దగ్గు, క్షయ, జల ఉదరం, గ్యాస్, ఆయాసం, జలుబు

 సింహం: గుండె జబ్బులు, రక్తపోటు, గుండె దడ, గుండెలో కండరాల వాపు, గుండెలో వల్వులు చెడిపోవడం, తల తిరుగుట, మోకాలి నొప్పులు, చెప్ప వాపు

కన్య: కాలేయము సమస్యలు, కడుపునొప్పి, అల్సర్లు, వాంతులు, పొట్టవ్యాధులు 

 తుల: మూత్రపిండాల వ్యాధులు, వాపు, యూరినరీ ఇన్ఫెక్షన్స్, కాలి వేళ్ళ వాపులు, అపెండసైటిస్

 వృచ్చికం: గనేరియా హైడ్రోసెల్ వాపు, ఫిస్టులా, గతంలో పుండ్లు, తెల్ల బట్ట, గ్యాస్, సిఫిలిస్, నిద్రలో నడుచుట, చర్మవ్యాధులు 

 ధనస్సు: కీళ్లవాతం, ధనర్వాతం, సయాటికా గౌట్,మధుమేహం, నడుము నొప్పి

 మకరం: మోకాళ్ళ నొప్పులు, వాపులు ఎముకలు విరుగుట, చర్మవ్యాధులు, కీళ్ళ వాతం, ఆయాసం, గుండె వ్యాధులు, శ్వాసకోస వ్యాధులు 

 కుంభం: కాళ్ళ వాపు,బోదకాలు, అజీర్ణ సమస్యలు,యుగుళ్ల వాపు, నొప్పి,శ్వాసక్రియ లోపాలు,అజీర్ణవ్యాధులు, మలబద్ధకం, బిపి 

 మీనం: మడమ నొప్పి, పాదాలు పొంగుట, పచ్చకామెర్లు, పాదాలలో ఎముకలు విరుగుట, గ్యాస్టిక్  

 

 నవగ్రహాలు శరీర అవయవాలు:

 రవి--- ఎముకలు

 చంద్రుడు--- రక్తం

 కుజుడు--- మజ్జ 

 బుధుడు --- చర్మం

 శుక్రుడు--- మాంసం నుండి కొవ్వుకు 

 శని--- నరాలు

 నవగ్రహాలు --- వాత పిత్త దోషాలు 

 బుధుడు--- పైత్యం 

 గురుడు --- వాతం

 రవి---- వాతం, పిత్తం 

 చంద్రుడు-- వాతం 

 శుక్రుడు--- పైత్యం

 శని--- వాతకారకం 

 రాహువు --- పైత్య వికారం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...