ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

6, ఏప్రిల్ 2026, సోమవారం

నాడి తంత్ర: ఉప చక్రాలు

 

                                                   నాడి తంత్ర: ఉప చక్రాలు

సోమచక్రం :

-- అమృత చక్రం అంటారు.

-- ఆజ్ఞా చక్రానికి సహస్ర చక్రానికి మధ్యలో ఉంటుంది.

-- ఈ చక్రం మూడవ నేత్రం నీడలో కప్పబడి ఉంటుంది.

-- 12 దళములుగా వెండి రంగులో ఉంటుంది.

-- ఈ చక్రం సమయ పాలనను నియంత్రిస్తుంది.

-- విశుద్ధ చక్రంపై దీని ప్రభావం ఉంటుంది.

-- జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడం, చర్మం పొడిబారడం, ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పులు, థైరాయిడ్ అసమానతలు, శరీర నిర్జలీకరణం.

 గురు చక్రం :

-- త్రికూటి మరియు జ్ఞాన చక్రం అంటారు.

-- నిర్వాణ చక్రానికి సహస్ర చక్రానికి మధ్యలో ఉంటుంది.

-- ఈ గురు చక్రం కపాలనాడులలో ఉన్న చక్రం.

-- ఇది 12 దళములు కలిగి ఉంటుంది తెలుపు రంగులో ఉంటుంది.

-- గురు చక్రం ఆధ్యాత్మిక రసవిద్యకు కేంద్రము.

 నిర్వాణ చక్రం :

-- తల పై భాగంలో ఆజ్ఞా చక్రానికి సహస్ర చక్రానికి మధ్య ఉంటుంది.

-- తెల్లని రంగులో వంద దళాల కమలంగా ఉంటుంది.

-- సుషుమ్న నాడీ యొక్క ఉపరి భాగంలో ఈ చక్రం ఉంటుంది.

-- దీనిని జలంధర చక్రము మరియు బ్రహ్మ రంధ్ర చక్రము అంటారు.

 లలనా చక్రం :

--కర్మలు శిఖా స్థానములోనే దాక్కొని ఉంటాయి.

-- బిందు విసర్గం లేదా తాలుచక్రం అంటారు.

-- ఈ చక్రం చైతన్యవంతంగా లేకపోతే జీవితం బాధాకరంగా ఉంటుంది.

-- చైతన్యం కావడానికి కేచరీ ముద్ర వేయాలి.

-- ఈ చక్రం ఉత్తేజపరచడానికి షణ్ముఖి ముద్ర, నవముఖి ముద్ర వెయ్యాలి.

-- ఈ చక్రం 12 దళముల కమలంగా ఉంటుంది.

-- చంద్రుని శక్తి అమృతం రూపంలో శ్రమిస్తుంది.

 కల్పవృక్ష చక్రం: 

--హృత్ చక్రం అంటారు.

-- 8 దళముల కమలం ఉంటుంది 

-- ఈ చక్రం జయము ద్వారా సాధకుడు తన కోరికలు తీర్చుకునే శక్తిని సంపాదిస్తాడు 

 మహానాదం :

 --ఈ చక్రం థాలమస్ గ్రంధికి అనుసంధానం.

-- మహా ధ్వని అంటారు

-- నాగలి లాగా ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...