ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

7, ఏప్రిల్ 2026, మంగళవారం

అగ్నిహోత్రం

 

అగ్నిహోత్రం:

రాగి పళ్ళెము లేదా మట్టి పళ్లెము లో కొన్ని  పలుచగా వుండే ఆవు పిడకలు వేసి వాటిమీద కొద్దిగా కర్పూరం ముక్క వుంచి అగ్గి ముంటించాలి. 

ఇలా ముంటిస్తే కొద్దిసేపటికి పిడకలు నిప్పులుగా మారును

ఈ నిప్పులపైన కొద్దిగా 2 చెంచాలనుంచి 4 చెంచాలు నెయ్యి వేసి ఈ క్రింద చెప్పబడిన మూలికల పొడి 

కొద్ది కొద్దిగా వేసి ఈ అగ్నిహోత్రం తో వెలువడే పొగని పీల్చుకొవాలి

 

అగ్నిహోత్రం చేయునప్పుడు నిర్మలమైన మనస్సుతో ప్రశాంతమైన ఆలొచనతో చేస్తున్న పనిమీద దృష్టిని కేంద్రీకరించి అగ్నిహోత్రం చేయాలి.

 

అగ్నిహోత్ర దూపంతో ఆరొగ్యం ఎలా వస్తుంది.... ఆవునేతిని అగ్నిహోత్రంలో వేసినప్పుడు అందులోనుండి అనంతమైన ప్రాణవాయువులు బయటకి వస్తాయి, అలాగే ఈ క్రింద చెప్పిన మూలికల పొడి వేయడం వల్ల ఓషధశక్తి మెత్తం కనురెప్ప సమయంలోనే వాయువుగా మారి మీ చుట్టూ వున్న గాలిలో పొగరూపంలో వెలువడుతుందిఈ పొగని పీల్చుకొవడం వల్ల అప్పటికప్పుడె మీ శరీరంలో నరనరాలకి  ఈ మూలికల శక్తి

నెయ్యి యెక్క ప్రాణ వాయువు, వెళ్ళి సర్వాంగాలను ఉత్తేజపరచి రోగాలని నయం చెస్తాయి

ఇది రోజూ చేయడం వల్ల రోగాలు లేని వారికి రోగాలు రాకుండా రోగాలు వున్నవారికి ఓషధంగా ప్రాణశక్తి శరీరంలోని నరనరాల్లోకి ప్రవహించి

ఆ నరాలలో మారుమూల ఎక్కడెక్కడో దాగి గడ్డకట్టిన రోగకారక విషపదార్థాలను మరియు 

ఆ విసపదార్దాలనుండి పుట్టిన రోగాలను, క్రిములను నాశనం చేస్తుంది.

అంతేకాక ఇంటిలో నలుమూలలా ఉన్న క్రిములను చంపడంలో సహాయపడుతుంది.   

ఈ విధంగా ఉదయం మరియూ సాయంత్రం చేయడం ఉత్తమంగా ఉండి దీర్ఘకాలిక రోగాలని మట్టికర్పించడంలో ఎంతో అద్బుతంగా పనిచేస్తుంది.

 

అగ్నిహోత్రానికి కావాల్సిన మూలకలు.....

1, అడ్డసరం ఆకులు 2, ఆకుపత్రి  

3, ఆవునేయి  4, ఉత్తరేణి సమూలం 

5, ఉసిరిక ఆకులు లేదా కాయలు  6, కరక్కాయ పొడి 

7, తానికాయలు  8, కామంచి  

9, వాయింట సమూలం  

10, మామిడి ఆకులు, లేదా బెరడు 

11, కొడిసెపాల ఆకులు లేదా బెరడు , కాయలు 12, కొత్తిమీరి సమూలం 

13, నేరేడు ఆకులు, కాడలు, పండ్లు,  

14, సుగంధపాల వేళ్ళు  15,  ఆముదం చెట్టు సమూలం  16, కర్పూరం  17, చిలుకతోటకూర సమూలం 

18, చింతపండు, చింతాకు , బెరడు 19, సొంటి   

20, చిర్రికూర సమూలం 21, చేదుపొట్ల  

22, చిన్నపల్లేరు సమూలం 23, పెద్దపల్లేరు సమూలం 

24, జాజికాయలు  25, జాపత్రి  

26, జిల్లేడు సమూలం 27, తక్కోలములు  

30, మరువం  31, ధవనం  32, నాగకేశరాలు  

33, నిమ్మాకులు , కాడలు, బెరడు 

34, నేలములక సమూలం 35, వాకుడు చెట్టు సమూలం  36, నేల వేము సమూలం 37, పాలకూర సమూలం 

38, తెల్ల ఎర్రగలిజేరు సమూలం 

39, రెడ్డివారినానుబాలు సమూలం 

40, తులసి తెలుపు లేదా నలుపు సమూలం 

41, మెంతి కురసమూలం 42, ఫిరంగి సాంబ్రాణి  

43, వేపాకులు, బెరడు, పండ్లు

44, మర్రిఆకులు, పండ్లు, బెరడు

45, రావి ఆకులు, పండ్లు, కాడాలు  

46, జువ్విఆకులు, పండ్లు, కాడలు

47, మేడి ఆకులు  48, కానుగ ఆకులు, పండ్లు, కాడలు 49,  తెల్లమద్ది ఆకులు, పండ్లు, కాడలు

50, ఎర్రమద్ది ఆకులు, పండ్లు, కాడలు 

51, జమ్మిఆకులు, కాడలు

52, ముల్లంగి ఆకులు దుంపలు  

53, మునగచెట్టు ఆకులు, పూలు, కాడలు  

54, వాయు విడంగాలు  55, సరస్వతీ సమూలం  

56 , గుగ్గిలం, 57, ఈశ్వరీ తెలుపు లేక నలుపు సమూలం 58, అస్వగంధ దుంపలు 59, చందనం  

60, గంధ కచ్చూరాలు  61, పిప్పింటచెట్టు,  

62, గాయపాకు, 63, బూరగ ఆకులు, బెరడు  

64, తుత్తురబెండ సమూలం 

65, మారేడు ఆకులు, కాయలు , పండ్లు,  

66, ఊడుగ ఆకులు, పండ్లు, బెరడు

67, నువ్వులు  68, నేలతాడి, 69, అతిమధురం 

70, గుంటగలగర  71, నేల ఉసిరి  72, జటామాంసి  

73,  భావాంచాలు  74, మిరియాలు, 75, తుంగగడ్డలు  76, పొద్దు తిరుగుడు ఆకులు, పూలు గింజలు  

77, వసకొమ్ములు  78, గరిక సమూలం 

79, దర్బసమూలం 80, మెదుగ ఆకులు, పూలు, బెరడు  81, వాము  82, ఆవాలు  83, సొంపుగింజలు  

84, దాల్చిన చెక్క  85, లవంగాలు 86, మాచిపత్రి   

87, జీలకర్ర 88, ధనియాలు 89, కొబ్బిరి  

90, దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు , కాడలు 

91, కుక్కపొగాకు సమూలం 92, పిచ్చికుసమ సమూలం 93, తుమ్మికూర చెట్టు సమూలం 

94, గన్నేరు ఆకులు కాడలు 

95, ఉమ్మెత్త ఆకులు, పూలు, కాయలు, వేళ్ళు 

96, కలబంద గుజ్జు, వేళ్ళు  97, సబ్జా మెక్క సమూలం  98, ఇంగువ, 99, తంగేడు సమూలం 

100, దిరిసెన చెట్టు ఆకులు, కాడలు, బెరడు పూవులు. 101, నేల తంగేడు సమూలం 

 

ఈ అన్ని వస్తువులు ఒక్కోక్కొటి సమానంగా తీసుకొని, అనగా పై చెప్పిన ఆకులు, బెరడు, కాయలు పండ్లు 

ఏవి దొరికితే అవి ఒక్కో మూలిక ఒక్కభాగం అనగా 

ప్రతి ఒక్కటీ సమానంగా తీసుకొని అన్నీ కలిపి నున్నని పొడిలాగా కాకుండా కచ్చా పచ్చాగా కొద్దిగా గరుకుగా చేసుకొని ఒక పాత్రలో వేసుకొని భద్రపరుచుకొని 

పైన చెప్పినట్టుగా ఉదయం , మరియు రాత్రి 

అగ్నిహోత్రం చేస్తూవుంటే దీర్గకాలికరోగాలకి ఎంతో 

మంచి చేసి రోగాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

 

ముఖ్య గమనిక :

పై చెప్పిన 101 మూలికల్లో ఎన్ని దొరికితే అన్ని సమానంగా వేసుకొండి

ఉదాహారణకి 50 వస్తువులు దొరికితే 

ఒక్కోక్కటి 100 గ్రాలు చొప్పున వేసుకొన్న మీకు 5 కేజీల అగ్నిహోత్రం మందు తయారు అయినట్లే

ఇలా ఎన్ని వస్తువులు మీచుట్టు పక్కల మీకు అనుగుణంగా దొరికితే అన్ని తీసుకొని 

వాడుకొవడం మంచిది.

మనం లోనికి తీసుకొనె ఆహరం నిదానంగా పనిచేస్తే 

ఇలా అగ్నిహోత్రం ద్వారా గ్రహించే ఓషధం అతి త్వరగా మన శరీరంలో ప్రతి యెక్క అంగానికి చేరుతుంది

ఇది ఎంతో ఉత్తమమైన వైద్యం

దీనికి తోడు లోనికి తీసుకొనే ఓషధం వల్ల మీకు అత్యంత త్వరగా ఆరొగ్యం చేకూరుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...