ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

7, ఏప్రిల్ 2026, మంగళవారం

వడ్డాణ మాల

 

వడ్డాణ మాల

1) గురివింద వేరు వడ్డాణ ధారణ:

శ్లో॥ కామరత్నే॥ఉత్తరాభిముఖం గ్రాహ్యం శ్వేత గున్జీయ మూలకమ్ । 

కట్నాంబద్ధ్వా విముక్తం వేత్ గర్భపుత్రం తు తక్షణాత్ ॥ 

వాసకస్యంతు మూలంతు చోత్తరస్యాం సముద్ధరేత్ |

 కట్యాం బద్ధ్వా సప్త సూత్రైః స్సుఖం నారీ ప్రసూయతే

తా:- ఉత్తరాభి ముఖముగా బారిన తెల్ల గురివింద వేరును తీసుకొని వచ్చి నడుముకు కట్టిన యెడల గర్భిణీ స్త్రీకి సుఖ ప్రసవము గలుగును. మరియు ఉత్తరాభి ముఖముగా బారిన అద్దసరము వేరును దీసికొని వచ్చి యేడు దారములచే కట్టి నడుముకు కట్టిన గర్భీణీ స్త్రీ సుఖమున ప్రసవించును.

 

2) సహదేవి వేరు వడ్డాణ ధారణ:

శ్లో॥ సహదేవ్యాశ్వ మూలం వాకటి స్థం ప్రసవేత్సుఖమ్

తా:- సహదేవి వేర్లుగాని అశ్వవేర్లుగాని మూలముగాని, తెచ్చి నడుమునకు కట్టిన సుఖ ప్రసవ మగును.

 

3)చెరకు వేరు వడ్డాణ ధారణ:

శ్లో॥ మాతులుంగస్య మూలంతు మధుకం సంయుతం తథా

ఘృతేన సహితం పిత్వా సుఖం నారీ ప్రనూయతే

తా:- చెఱుకు యొక్క వుత్తరపు దిక్కు వేరును తనంత పొడవు గల నూలుతో బంధించి నడుము నందు కట్టుకొనిన యెడల స్త్రీ ఆలస్యము లేక సుఖముగ ప్రసవించును.

 

4) తాటి వేరు వడ్డాణ ధారణ:

శ్లో॥ తాళస్యచోత్తరం మూలం స్వప్రమాణేనతంతునా | బధ్వాకట్యాంతు నియతం సుఖం నారీ ప్రసూయతే

తా:- తాటి చెట్టు యొక్క వుత్తరపు దిక్కుగా బారిన వేరును తరంత - బొడవు గల నూలుతో బంధించి నడుము యందు గట్టు కొనిన యెడల స్త్రీ సుఖముగ ప్రసవించును.

 

 

5) ఉత్తరేణి వేరు వడ్డాణ ధారణ:

శ్లో॥ ప్రత్యక్పుప్ప్యాః పారిభద్రస్యయద్వా | మూలంయద్వా కాక జంఘానముత్థమ్

కట్యాం బద్ధం యోషితాం.సత్ప్ర సూతిం | యోగే యుక్త్యా సంహృతం సాధు కుర్యాత్

తా:- తెల్లఉత్తరేణి వేరు, వేపవేరు, వెలమసంధివేరు, అనువానిలో దేనినైనాగాని శుభవార నక్షత్ర యోగములందు దీసి కొని వచ్చి నడుముకు కట్టిన స్త్రీ సుఖముగ ప్రసవించును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...