ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

6, ఏప్రిల్ 2026, సోమవారం

నాడి తంత్ర : చక్రాలు

 

ఆజ్ఞా చక్రం:

* దీని చిహ్నంలో త్రిభుజం తెలివితేటలు అంతర దృష్టి మద్య సంబంధమును తెలియజేస్తుంది.

* రెండు దలములతో తెల్లని రంగులో ఉంటుంది. ఈ కమలమును ఒడ్యాణ పీఠము అంటారు.

* హాకినీ దేవత ఇచ్చుట ఉంటుంది. ఈ దేవత ఎముకలలోని మజ్జ యందు ఉండి అన్ని చక్రాలకు సర్వశక్తులు ఇస్తుంది. 

* దీని రంగు ఇండిగో.

* దీని స్థానం: నుదురు కనుబొమ్మల మధ్య ఉంటుంది.

* గ్రంధి: పీనియల్ గ్రంధి 

* ఓం శబ్దం జపించడం వల్ల ఈ చక్రమును యాక్టివ్ చేయవచ్చును.

* ఈ చక్రం చెడిపోవడం వల్ల తలనొప్పి, సైనసైటిస్, కంటి ఒత్తిడి, నరాల సంబంధ వ్యాధులు కలుగును.

* చిన్ముద్ర, జ్ఞానముద్ర, హాకిని ముద్ర వల్ల ఈ చక్రం ఆరోగ్యంగా ఉంటుంది.

* పశ్చిమొత్త ఆసనం, శీర్షాసనం వేయడం వల్ల ఈ చక్రం ఆరోగ్యంగా ఉంటుంది.

* అనుబంధ గ్రహాలు: శని, బృహస్పతి

* ఈ చక్రం నియంత్రించబడే అవయవాలు: కళ్ళుచెవులు, ముక్కు, మెదడు, నాడీ వ్యవస్థ, పిట్యూటరీ, పీనియర్ గ్రంథి

* ఆజ్ఞా చక్రం అతి చురుకుగా మారితే: 24 గంటలు ఊహలలో జీవిస్తాడు. అధికంగా కలలు వస్తుంటాయి. దృఢమైన మనస్తత్వం ఉంటుంది. వీరు పరధ్యానంలో ఉంటారు.

* ఆజ్ఞ చక్రం బలహీనమైతే: జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. నేర్చుకునే విషయాలు ఆలస్యం అవుతాయి. ఊహ శక్తి తక్కువ అవుతుంది.

* ఆజ్ఞా చక్రం సమతల్యంగా ఉంటే: ఆకర్షణీయమైన సహజమైన మనసు కలిగి ప్రశాంతంగా ఉంటారు. వీరిలో ఆలోచన శక్తి బాగుంటుంది.

* ఆజ్ఞ చక్రం కోసం “రుద్రయామల తంత్రం”, “మహా మోక్ష తంత్రం” అనే గ్రంథాలలో చెప్పబడింది.

* మూలకం: కాంతి (తేజస్సు)

* బీజ మంత్రం: ఓం 

* ఆజ్ఞా చక్రంలోని నెగిటివ్ ఎనర్జీని బయటకు తీస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.  ఏకాగ్రత బాగుంటుంది.  విషయంపై అవగాహన పెంచుకుంటాడు.  ఇంద్రియాలు నియంత్రించే శక్తి పెరుగుతుంది.

* అనులోమావిలోమ ప్రాణాయామ చేస్తే ఆజ్ఞ చక్రం శక్తి పెరుగుతుంది.

* త్రాటకం, శాంభవి ముద్ర చేయడం వల్ల ఆజ్ఞ చక్రం యాక్టివ్ అవుతుంది.

 మూలాధార చక్రం : 

-- సృష్టికి మూలస్థానం మనిషి జననానికి పునాది దీనికి భూలోకం అంటారు.

-- ఇది మొదటి చక్రం

-- నాలుగు దళాలు ఉన్న పద్మం ఉంటుంది. ఇది మనసు బుద్ధి చిత్తం అహంకారం ను సూచిస్తాయి.

-- పద్మ దళాలుపై వం, శం, షం, సం అని బీజాక్షరాలు ఉంటాయి. చిక్కటి ఎరుపు రంగులో ఈ చక్రం ఉంటుంది.

-- బీజం మంత్రం: లం 

-- అధిష్టాన దేవత: గణేశుడు 

-- ఘణేంద్రియాలతో సంబంధం కలిగి ఉంటుంది.

-- అన్నమయ్య కోశానికి మూలస్థానం ఈ మూలాధార చక్రం.

-- మూలధారానికి సంబంధించిన కర్మేంద్రియం : మలద్వారం 

-- మూలాధార చక్రానికి సంబంధించిన ధాతువు: ఎముక

-- పృద్వి తత్వానికి చెందిన మూలాధార చక్రానికి యంత్రం చతురస్త్రం.  దీనిలో 7 తొండాలు ఉన్న ఏనుగు ఉంటుంది. ఏనుగుకు ఉన్న ఏడు తండాలు మనిషి యొక్క సప్త ధాతులకి సూచన.

-- మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రం.

-- ఈ మూలాధార చక్రంలో సాకిని నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖాలు 1) శబ్దం 2) స్పర్శ 3) రూపం4) రసం5) గంధం అనబడే 5 తన్మాత్రలు ఈ మూలాధార చక్రం వద్ద పనిచేస్తాయి.

-- అధిష్టాన దేవత "సిద్ధ విద్యాదేవి" ఈమె సాకినీ రూపంలో ఉంటుంది.

-- ఈ మూలాధార చక్రాన్ని శ్రీ విద్య పాసనలో త్రైలోక్య మోహన చక్రం అంటారు.

-- మూలాధార చక్రము నందు ధ్యానం చేసినచో కుండలిని జాగృతి  అగుటకు సులభంగా ఉంటుంది.

-- మూలాధారం కుండలిని శక్తికి స్విచ్ లాంటిది.

3) స్వాధిష్టాన చక్రం:

-- స్వాధిష్ఠాన చక్రములో కమలం ఆరు దళాలు గల జలతత్వం ఉంటుంది.

-- అది దేవత: కాకిని.

-- అనేక జన్మల నుండి వెంట తెచ్చుకుని పాపపుణ్యాలను అనుభవంనకు తీసుకొచ్చే చక్రం.

-- ఈ చక్రం జననేంద్రియాల వెనుక భాగంలో వెన్నుముకలో  ఉంటుంది.

--11664 నాడులతో అనుసంధానింపబడి ఉంటుంది.

-- ఓవరిస్, టెస్టిస్ లకు ప్రాణశక్తి ఇస్తుంది.

-- గర్భస్థ శిశువుకు ప్రాణ శక్తిని ఇచ్చే చక్రం ఇది.

-- జీవునకు తల్లి గర్భమునందు స్థానమేర్పడడాన్ని మూలాధార చక్రం కారణం అయితే పిండం భౌతిక శారీరంగా తయారవ్వడానికి స్వాధిష్టాన చక్రం ప్రాణ శక్తిని ఇస్తుంది.

-- శరీరానికి ఉష్ణోగ్రత ఈ చక్రం ఇస్తుంది 

-- ఈ చక్రంకు పంచకోసాలలో ప్రాణామయ కోసంతో సంబంధం ఉంటుంది.

-- ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే పాండురోగం, కంటి సమస్యలు, గర్భకోశ వ్యాధులు, జ్వరాలు కారణమవుతాయి.

-- ఈ చక్రం మూసుకుపోవడం వల్ల మితిమీరిన కామ వాంఛలు కలుగును. అపరాధ భావన దురాశ, క్రోధం,, అనుమానం, ఉద్రేకం, నిరాశ కలుగును.

-- ఈ చక్రం బలహీనంగా ఉంటే చద్ది అన్నం తినాలి.

-- బీజాక్షరం: వం 

-- చక్రానికి అధిపతి: శుక్రుడు 

 విశుద్ధి చక్రం:

-- కంఠ స్థానం దగ్గర ఉంటుంది.

-- 16 దళాల శ్వేత వర్ణంగా ఉంటుంది.

-- ఈ చక్రం అసత్యాలు మాట్లాడ్డం వల్ల ఇది బ్లాక్ అవుతుంది.

-- చర్మం అనే ధాతువు నందు డాకిని అను యోగిని దేవత రక్త వర్ణంతో ఉంటుంది

-- ఇది ఆకాశతత్వం కలిగి ఉంటుంది

-- మాతృ గర్భంలో శుక్ల- రక్త బిందువులు మిశ్రమం కావడం చేత రజో బిందువు ఏర్పడను ఈ రెండు బిందువులు కలిసినప్పుడు అపారమైన కాంతిపుంజం శక్తి ఉద్భవిస్తుంది దీనినే నేటి శాస్త్రవేత్తలు జింక్ స్పాట్ అని పిలుస్తున్నారు వారం తర్వాత బుద్బుదాకారం 15 రోజుల తర్వాత పిండముగాను గర్భస్థ శిశువును వజ్రేశ్వరి అంటారు విశుద్ధ చక్రంలో చెప్పిన దేవత ఈ పిండమే.

 అనాహత చక్రం :

-- హృదయం మధ్య భాగంలో ఉంటుంది.

-- ఆత్మ యొక్క కేంద్ర స్థానం.

-- గుండె, ఊపిరితిత్తులు, గాల్ బ్లాడర్  తో కనెక్ట్ అయి ఉంటుంది.

-- ఈ చక్రం దుఖం వల్ల  బ్లాక్ అవుతుంది.

-- 12 దళాల కలిగి ఉంటుంది.

-- వాయుతత్వం కలిగి ఉంటుంది.

-- రక్తం అనే దాతునందు రాకిని అనుయోగిని దేవత ఉంటుంది.

-- నెయ్యితో చేసిన అన్నం తినాలి.

 మణిపురా చక్రం:

-- పసుపు రంగులో ఉంటుంది.

-- విష్ణు గ్రంధి అని పిలుస్తారు.

-- అగ్నితత్వం కలిగి ఉంటుంది.

-- కాలేయం, ప్రాంక్రియాసిస్, పెద్ద ప్రేవులు, చిన్నప్రేవులు, అపెండిసైటిస్, పొట్ట భాగంతో కనెక్ట్ అయి ఉంటుంది.

-- అవమానం పొందడం వల్ల ఈ చక్రం బ్లాక్ అవుతుంది.

-- దీనిని జయించిన వారు నీటిపై తేలుట నడుచుట వంటి శక్తులు కలిగి ఉంటారు.

-- 10 దళములతో లాకిన్యంబా స్వరూపంలో యోగినీ దేవత ఉంటుంది.

-- మండల కాంతితో వెదజల్లుతూ ఉంటుంది.

-- ఈసాధన చేసేవారు బెల్లం తినాలి.

 

                                 చక్రాలు.. పంచభూతాలు

                      మూలాధార చక్రం... భూమి తత్వం

                      స్వాధిష్ఠాన చక్రం.... జలతత్వం 

                      మణిపూర చక్రం.... అగ్ని తత్వం 

                      అనహతాచక్రం... వాయు తత్వం 

                      విశుద్ధ చక్రం... ఆకాశ తత్వం 

                                    చక్రాలు.... అధిష్టాన దేవతలు 

                                         మూలాధారం.... వినాయకుడు

                                         స్వాధిష్ఠాన చక్రం... బ్రహ్మ

                                          మణిపూర చక్రం... విష్ణువు 

                                          అనహతా చక్రం... రుద్రుడు

                                           విశుద్ధ చక్రం... జీవుడు 

                                           సహస్ర చక్రం... ఈశ్వరుడు

                                                చక్రాలు... వాహనాలు

                                                      మణిపురాచక్రం... కప్ప

                                                       అనాహత చక్రం... లేడీ 

                                                       విశుద్ధ చక్రం... ఏనుగు

                                                        మూలాధార చక్రం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...