ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

6, ఏప్రిల్ 2026, సోమవారం

క్షారాలు

 

F) క్షారాలు 

*మానుప్ప:

--అరటి సొరుగు ను కాల్చి దీని నుంచి క్షరం తయారు చేస్తారు.

-- దీనిని సేవిస్తే మూత్రం జారీ అగును అజీర్ణము, శూల, కడుపు ఉబ్బరం, పులిత్రే న్పులు, మూత్ర కృచ్ఛం, వ్రణాలు, గడ్డలు తగ్గును.

-- చంటి పిల్లలకు మూత్రం రాకపోతే ఈ క్షారమును చనుబాలతో కూడా కలిపి ఇవ్వాలి.

-- పెద్దలు దీనిని తీసుకున్నప్పుడు నిమ్మరసంలో కలిపి తీసుకోవాలి.

* కదళ్యాది క్షారము:

అరటియాకు, ఏనుగుపల్లేరు వీటి క్షారములను నూనెలో కలిపి విధిప్రకారము పక్వముజేసి యిచ్చిన యకృల్లీహవృద్ధులు, లోనగునవి హరించును.

*విడంగాది క్షారము:

వాయువిడంగములు, చిత్రమూలము, నేతితో తడిపిన సక్తువులు, సైంధవలవణము,వస వీటిని సమభాగములుగ కుండ పెంకులో నుంచి క్షారముగావించి, ఆక్షారమును ఆవుపాలలో గలిపి పానము జేయించిన యకృత్ల్పహవృద్ధులుహరించును.

* తాళజట క్షారము:

తాటిపూవులను మట్టికుండలోయుంచి మూత వేసి కాల్చితీసిన క్షారములోనికి యుక్తియుక్తముగ మోతాదునియ పాత బెల్లములో కలిపియిచ్చిన యకృత్ల్పహములు మించి హరించును.

* దేవదార్యాది క్షారము:

దేవదారు చెక్క, సైంధవలవణము, శుద్ద గంధకము సమానభాగములుగ జేర్చి కాల్చి క్షారముగావించి తీసి యుక్తి యుక్తముగ పాత బెల్లములో పొదిపి యిచ్చిన యకృల్లీ ్పహ వృద్ధులు హరించును.

* వజ్ర క్షారము: 

సైంధవలవణము, కాచాలవణము, సౌవర్చలవణము, పొంగించిన వెలిగారము, యవక్షారము, సర్జక్షారము వీనిని సమాంశములుగ గ్రహించి మర్దన జేసి, జిల్లేడుపాలలోను, ఆకు జెముడు పాలలోను వరుసగా మూడేసి దినములు సూర్య ఫుటమునిచ్చి యెండిన పిదప దానిని రాగిపాత్రయందుంచి, చక్కగా వానిమూతిని బంధించిన పిదప, పుటపాకవిధి సనుస రించి పక్వము జేయవలయును. తరువాత నాఔషధమును త్రికటుకములు, త్రిఫలములు, జీలకర్ర, పసపు, చిత్రమూల మువేళ్ళు వీనిని ప్రతిదానిని ఔషధములో సగముండునటుల చూర్ణించి, ఆచూర్ణము పైయౌషధములో గలిపి, యుక్తి

కొలది మోతాదు 1/2 తులమునకు మించకుండా యిచ్చిన యకృతి ప్లీహ రోగములు, ఉదరరోగములు, అగ్నిమాంద్యము, అజీర్ణములు హరించును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...